Thursday, July 10, 2025

టెక్నో నుంచి కొత్త ఫోన్ సిరీస్‌ లాంచ్..

- Advertisement -
- Advertisement -

టెక్నో ఇటీవల తన టెక్నో స్పార్క్ 40 సిరీస్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి.టెక్నో స్పార్క్ 40, స్పార్క్ 40 ప్రో, స్పార్క్ 40 ప్రో+. ఈ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

టెక్నో స్పార్క్ 40

ఈ ఫోన్‌ 4GB RAM + 128GB వేరియంట్ ధర ధర 4,79,000 UGX (సుమారు ₹11,400)గా పేర్కొంది. ఇది ఇంక్ బ్లాక్, మిరాజ్ బ్లూ, వీల్ వైట్, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G81 చిప్‌సెట్ అమర్చారు. ఇందులో 8GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. కెమెరా సెక్షన్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫోన్‌ IP64 రేటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

టెక్నో స్పార్క్ 40 ప్రో

ఈ మోడల్‌ 4GB RAM + 128GB వేరియంట్ ధర ధర 679,000UGX (సుమారు రూ. 16,200)గా కంపెనీ పేర్కొంది. ఇది బాంబూ గ్రీన్, ఇంక్ బ్లాక్, లేక్ బ్లూ, మూన్ టైటానియం రంగుల్లో వస్తుంది. ఇందులో హీలియో G100 అల్టిమేట్ చిప్‌సెట్ ఉంది. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి ముఖ్యమైన ఫీచర్లు ప్రో+ వేరియంట్ మాదిరిగానే ఉంటాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇందులో ప్రత్యేకత. ఫోన్ మందం 6.69mm.

టెక్నో స్పార్క్ 40 ప్రో+

ఈ ఫోన్ 8GB RAM + 128GB వేరియంట్ ధర ధర ఉగాండాలో 7,69,000UGX (సుమారు రూ. 18,300)గా కంపెనీ పేర్కొంది. ఇది ఇంక్ బ్లాక్, మిరాజ్ బ్లూ, వీల్ వైట్, టైటానియం గ్రే రంగుల్లో వస్తుంది. ఇది ప్రపంచంలోనే హీలియో G200 చిప్‌సెట్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్. ఇందులో 6.8 అంగుళాల 1.5K 3D AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 50MP రియర్,13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5200mAh బ్యాటరీతో 45W వైర్డ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్, NFC, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News