Friday, July 11, 2025

రేషన్ కార్డుల పేరిట దళారుల వసూళ్ల పర్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలు పొందాలన్నా, వాటికోసం దరఖాస్తు చేసుకోవాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం స్వీకారం చుట్టిన నేపథ్యంలో రేషన్ కార్డును పొందేందుకు అర్హులైన వారు అనేకపాట్లు పడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డు పొందడం, ఉన్న కార్డులో నుంచి పేర్ల తొలగింపు, పిల్లల పేర్లను నమోదు చేయించడంపై కొందరు గ్రామీణులకు అవగాహన లేకపోవడమనేది ఇంటర్నెట్, నెట్ నిర్వాహకులు, దళారులకు వరంగా మారింది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొంని రేషన్ కార్డుల పేరిట వసూళ్ళ దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తహశీల్దార్ కార్యాలయాల్లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్లు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో ఆమోదం తెలుపాలి. ఈ ప్రక్రియ కొనసాగాలంటే కనీసం పది రోజుల సమయం పడుతోంది.

కానీ రాజకీయ పలుకుబడి, సన్నిహితంగా ఉన్న వారికి ఒకే రోజులో రేషన్ కార్డు మంజూరు అవుతోంది. సాధారణ దరఖాస్తుదారుడు మాత్రం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అప్లికేషన్స్ ఫార్మ్ పోగొట్టుకపోవడంతో అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకున్న దాఖలున్నాయి. ఇది ఇలా ఉంటగే ఆపరేటరుల కొత్త రేషన్ కార్డుకు ఓ రేటు, పాత రేషన్ కార్డుల్లో నేమ్ అడిషన్ పేర్ల తొలగింపు, పేర్లు కరెక్షన్ లకు ఇలా ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతునట్లు ప్రజలు ఆరోపించారు. తహశీల్దార్‌ల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా మండలాల ప్రజలు మండిపడుతున్నారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు రేషన్ కారుడ మంజూరు చేయాలని ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను కోరారు.

కంప్యూటర్ ఆపరేటర్ల వసూళ్ల పర్వం 
గద్వాల, గట్టు, ధరూర్, కేటిదొడ్డి, గట్టు, మల్దకల్, అయిజ, ఇటిక్యాల, అలంపూర్, తదితర మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. మీసేవ, ఇంటర్నెట్ ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ప్రతి పెండింగ్ దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటరుల పరిశీలించి అర్హులైన సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నారు. ఆన్‌లైన్ ఆమోదానికి ఆపరేటర్లకు ఎంతో కొంత ఇయాల్సిందే అని ఆపరేటర్లు నానుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఒక్కో రేషణ్ కార్డు లబ్దిదారుల నుంచి రూ 500 నుంచి రూ 2వేల వరకు వసూళ్లు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్న సంబంధిత అధికారులు నివారించకపోవడం కొసమెరుపు.

అన్నీ తామే చూసుకుంటాం: దళారులు
రేషన్ కార్డు కోసం మీసేవ సెంటర్‌లో దరఖాస్తు చేసిన పత్రాలను తహశీల్దార్ ఆఫీస్‌లో సమర్పిస్తే అర్హులను గుర్తించి తహశీల్దార్ సిఫారసు మేరకు ఉన్నతాధికారులు రేషన్ కార్డులను మంజూరు చేస్తారు. దీనిపై దరఖాస్తుదారులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆయా మండలాల్లో కొన్ని ఇంటర్నెట్ నిర్వాహకులు, మధ్యవర్తులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఒక్కొక్కరి నుంచి రూ 500ల నుంచి రూ 2వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు:గద్వాల ఆర్‌డిఓ
అర్హులైన ప్రతి ఒక్కరికి సర్కార్ రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది. ఇందుకోసం ప్రజలు ఎవరూ దళారులను ఆశ్రయించొద్దు. రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మాకు ఫిర్యాదు చేయాలి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తహశీల్దార్ కార్యాలయాల నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలిస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News