Thursday, September 11, 2025

టిఎస్‌ఎఫ్‌సిసి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎస్‌ఎఫ్‌సిసి) అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ (Sunil Narang) ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రవీంద్ర గోపాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, కార్యదర్శిగా శ్రీధర్ విఎల్, సంయుక్త కార్యదర్శిగా చంద్ర శేఖర్ రావు.జె, కోశాధికారిగా సత్యన్నారాయణ గౌడ్.బి ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులను ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Film Chamber Commerce) అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ “ఇది 80వ కార్యవర్గ సమావేశం. మాది ఎంతో పాత ఛాంబర్‌”అని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన తెలంగాణ ఛాంబర్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు జెమినీ కిరణ్, డి.సురేష్ బాబు, కెఎల్ దామోదర్ ప్రసాద్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News