Friday, September 12, 2025

విషాదం.. పెళ్లైనా 14 రోజులకే గుండెపోటుతో నవవరుడు మృతి

- Advertisement -
- Advertisement -

పెళ్లై రెండు వారాలు కూడా గడవకముందే ఓ నవ వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లాలోని అంసానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అక్కమొల్ల సాయికిరణ్, అదే గ్రామానికి చెందిన యువతిని మే 21న పెళ్లి చేసుకున్నాడు. నిన్న రాత్రి ఓ కార్యక్రమంలో బ్యాండ్ వాయించేందుకు వెళ్లొచ్చిన సాయికిరణ్.. మంగళవారం ఉదయం బాత్రూంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభంలేకపోయింది. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పెళ్లైన 14 రోజులకే సాయికిరణ్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలోనూ విషాదం నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News