మేషం: మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఋణాలు తీర్చి వేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఎప్పటినుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, సంబంధం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. కొంతమంది విషయంలో ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది. భూమి కానీ గృహం కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారిని మొగలిపువ్వు కుంకుమతో పూజించండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి మీ వంతు కృషి చేస్తారు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల కొరకు ధనం అధికంగా ఖర్చు చేయబడుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సహోదరులతో ఆస్తి తగాదాలు కానీ ఇతర వివాదాలు కానీ ఉండే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అంతంతమాత్రంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ పరమ పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారిని మొగలిపువ్వు కుంకుమతో మహాలక్ష్మి అష్టోత్తరంతో పూజించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మహాలక్ష్మి దేవి అమ్మవారిని మొగలిపువ్వు కుంకుమతో పూజించండి లక్ష్మీ తామరవత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు స్కై బ్లూ
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్కిన్ ఎలర్జీలు ఇబ్బంది పడతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. ఈ పరమ పవిత్రమైన శ్రావణమాసంలో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా రాణించగలుగుతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసరకులమ్మేవారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఎంతో కాలంగా సంతానం కోసం దురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నూతన ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ శ్రావణమాసంలో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్.
తుల: తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. క్రయవిక్రయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. సినిమా, కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. ధనం పొదుపు చేయడంలో విఫలమవుతారు. ఈ శ్రావణమాసంలో మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో మహాలక్ష్మి అష్టోత్తరంతో పూజించండి. లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై నిందారోపణలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ సీటు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రావణమాసం ప్రారంభమైంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి ప్రతిరోజు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి సహాయం లభిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. లీజులు లైసెన్సులు రెన్యువల్స్ లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడతాయి. విద్యార్థిని విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు పరిష్కార దశకు వస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ శ్రావణమాసం నెల రోజులు కుబేర కుంకుమతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి అలాగే లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంకె 4 కలిసివచ్చే రంగు గ్రీన్.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆరోగ్య పరంగా లివర్ కి సంబంధించిన సమస్యలు అజీర్తి సమస్యలు గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతాయి. కుటుంబ పరంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. విలాసాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రస్తుత పరిస్థితిలో అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఋణాలను తీర్చి వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపతనం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయండి అలాగే లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు.