Sunday, September 7, 2025

వార ఫలాలు (07-09-2025 నుండి 13-09-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభాల దిశలో ఉంటుంది. వ్యాపారంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడమే ఇందుకు కారణమని భావిస్తారు. గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ విషయాలు కొద్దికాలం వాయిదా వేయడం మంచిది. మిత్రులకు ధన  సహాయం అందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి- ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కెరియర్ పరంగా నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను అందుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి పరంగా ఉద్యోగాల పరంగా మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. మీకున్న తెలివితేటలతో అందరిని ఆకట్టుకుని ముందుకు సాగుతారు. మీ విజయం వెనుక మీ కృషి పట్టుదల ఉంటుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ యోగం ఏర్పడుతుంది.  కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. మీకు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి.  ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేయకపోవడం మంచిది. పొదుపు పైన దృష్టి పెట్టండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు ఆదిత్య  హృదయం చదవండి లేదా వినండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

మిథునం:  మిధున రాశి వారికి  ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్  మీ చేతికి అందుతాయి. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్నిరంగాల వారికి తగిన  గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ రంగంలో ఉన్న వారికి లాభాలు మోస్తరుగా ఉంటాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల  నుండి సహాయ సహకారాలు అందుతాయి. బందు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ఆర్థికంగా మరింత  పురోగతి సాధిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి.  ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రీన్.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి. కుటుంబ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తున్నాయి కాబట్టి వివాహాది శుభకార్యాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. పితృ దోషాలు ఉన్నవారు ఈ మహాలయ పక్షాలలో పితృ కార్యక్రమాలు నిర్వహించండి. నూతన కార్యక్రమాలు  ప్రారంభానికి అవరోధాలు తప్పవు. ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. దూరప్రాంత బంధువుల నుండి కొన్ని  విషయాలు తెలుస్తాయి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి.వృత్తి-ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సెల్ఫ్  డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు గ్రే.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధమైన విషయాలలో, వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన విషయం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం  చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. లోన్లకు క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు కలిసి రావు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండు కూడా కలిసి రావు.  క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి-వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి అష్టమ శని  ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీతామర వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

కన్య:  కన్య రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ  ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ  ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్  రంగాలలో వారికి మంచిగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా లేదు.  హోటల్ మేనేజ్మెంట్ సినీ కళా రంగాల  వారికి అనుకూలంగా ఉంది.  మీ కష్టపడే తత్వమే మిమ్మల్ని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇమ్యూనిటీ విషయంలో ఎసిడిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ  రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్  కావచ్చు, ట్రాన్స్ఫర్స్  కావచ్చు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారి ఆరాధన చేయటం, అరటినార వత్తులతో దీపారాధన చేయటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు పసుపు.

తుల:  తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి-వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మీరు చేరుకోవలసిన స్థాయిని మీరు చేరుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పిడి గురించి వాయిదా వేయాలి. ఈ రాశి వారు అప్పులకు దూరంగా ఉండండి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలించవు. భూమి  క్రయవిక్రయాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు సంబంధించిన విషయాలు  సానుకూల పడతాయి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లే వాళ్లకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవ్ విషయంలో. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో అర్చన చేయటం మంచిది. అలాగే మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి తిధి పరంగా పితృకార్యక్రమాలు చేయాలి.  ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిలోని వారికి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కానీ రావలసిన ధనం మాత్రం రాదు  భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి.  నూతనంగా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంచెం నిరాశ పరుస్తాయి వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోండి. జాగ్రత్తగా ఉండండి.  విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా ఎంత కష్టపడినా ఫలితం మాత్రం అంతంతే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంది ప్రభుత్వం పరంగా వచ్చే బెనిఫిట్స్ లభిస్తాయి. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వారికి కొంత నిరాశ ఉంటుంది. విదేశాలకు వెళ్లే వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించండి. వివాహ ప్రయత్నాలు కొంత నిరాశ పరుస్తాయి. ఈ రాశిలోని వారికి సొంత నిర్ణయాలు పనికిరావు.  అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. ఆదాయం తక్కువ వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా వస్తాయి. పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. పూర్వీకుల నుంచి రావలసిన బెనిఫిట్స్  కొంచెం ఆలస్యం అవుతాయి. కోర్టు సంబంధిత విషయాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి.  తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరుల సలహాల ప్రకారం నడుచుకోండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా బీపీ షుగర్ థైరాయిడ్,  కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు సుబ్రమణ్య స్వామి అష్టకం  పఠించడం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం అలాగే మంగళవారం నాడు కుబేర కుంకుమ తో అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు ఎరుపు.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీరికి  అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ వారం మీ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతాయి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.  రావాల్సిన ధనం సమయానికి చేతికి అందదు.  ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన ప్రయత్నాలు  ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి కాస్మెటిక్స్ కు సంబంధించి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరాశి వారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కష్టానికి సంబంధించిన ప్రతిఫలం ఇతరులు లాగేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అవుతాయి. పితృకార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది  విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది. మేధా దక్షిణామూర్తి రూపును ధరించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.  భూ సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కోర్టుకు సంబంధించిన పనులు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ స్వయంకృత అపరాధం వల్ల  పనులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులలో తోటి ఉద్యోగస్తులలో అపకీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఈ విషయాలలో తగు జాగ్రత్తలు వహించండి.  మీ తప్పు లేకున్నా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు తొలిగిపోతాయి. ఈవారం ఈ రాశి వారికి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. మానసిక ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండటం మంచిది తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వివాహ ప్రయత్నాలు అంత అనుకూలంగా లేవు పితృ కార్యక్రమాలు నిర్వర్తించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి సోమవారం నాడు శివయ్యకు రుద్రాభిషేకం చేయించండి. కాలభైరవ  రూపు మెడలో ధరించండి. ఈ రాశిలోని వారికి నరదృష్టి అధికంగా ఉంది. రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా బాగున్నప్పటికీ మానసిక ప్రశాంతత ఉండదు.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవాష్టకాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి గురువారం నాడు అన్నదాన కార్యక్రమాలు చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు మెరూన్.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట బయట  కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామితో గాని వ్యాపార భాగస్వామితో గాని ఇబ్బందులు ఏర్పడతాయి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.  రుణాలు ఇవ్వడం మంచిది కాదు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి భూమికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి.  అమ్మకానికి సంబంధించి కొనడానికి సంబంధించి మరియు రిజిస్ట్రేషన్ విషయంలో. కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు.  సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.  ఆరోగ్యానికి సంబంధించి గుండె సంబంధిత కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  ముఖ్యంగా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త.  ఏలినాటి శని నడుస్తుంది కావున శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే అఘోర పాశుపత హోమం చేయించండి. జీవిత భాగస్వామితో కలిసి  చర్చించుకుని ముందుకు వెళ్ళటం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. ముఖ్యంగా వైద్యరంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కులదైవ నామస్మరణ చేయటం మంచిది ప్రతిరోజు నాగ సింధూరం ధరించి ముందుకు వెళ్ళండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని కారణం చేత మాటలు పడవలసి వస్తుంది.  వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం  మంచిది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం  నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

మీనం: మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా లాభసాటిగా ఉంది. సంతాన పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మహాలయ పక్షాలలో  పితృ కార్య క్రమాలు సక్రమంగా నిర్వర్తించండి. పితృదేవతల ఆశీస్సులు మీ వంశానికి లభిస్తాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు కొంచెం వాయిదా వేయడం మంచిది. భవిష్యత్తు గురించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరి సలహాలు తీసుకోవడం మంచిది. వైద్య రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలోని వారికి టెక్నీషియన్స్ కి, రియల్ ఎస్టేట్ వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా వాటికి రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. చేయని తప్పుకు నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  విదేశీ ప్రయాణాలు కాస్త ఆలస్యం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి-ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామి పట్ల విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కొంత జాగ్రత్త వహించాలి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలోని వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు.

Rasi phalalu cheppandi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News