Sunday, May 4, 2025

బైసారన్‌లో ఎన్‌ఐఎ దళాల సంచారం

- Advertisement -
- Advertisement -

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం
అనంత్‌నాగ్: జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఎ) దళాలు శనివారం ప్రత్యేక వాహనాలలో పహల్గాం సమీపంలోని బైసారన్ మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాయి. స్థానిక పోలీసు స్టేషన్ నుంచి వీరిదండు కదిలింది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల తరువాత ఎన్‌ఐఎ దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ దశలో దర్యాప్తు లో భాగంగానే ఇప్పుడు ఈ శకటాల దండు సాగింది. దాడి ఏ కోణంలో జరిగింది? ఉగ్రవాదులు ఎక్కడి నుంచి తరలివచ్చారు.

మధ్యలో ఎటువంటి ఆధారాలు ఏమైనా మిగిల్చారా? అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. 2023 రాజౌరి ఉగ్రదాడులతో సంబంధం ఉండి పట్టుబడి ఇప్పుడు జమ్మూ జైలులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల పాత్రను కూడా ఇప్పుడు ఆరాతీస్తున్నారు. జైలులోనే వారిని ఇంటరాగేట్ చేస్తున్నారు. 2023 ఎప్రిల్ నుంచి ఉగ్రవాదులు ముస్తాఖ్, నిసార్‌లను జైలులో ఉంచారు. ఇప్పటి ఉగ్రవాద దాడికి వీరు అత్యంత వ్యూహాత్మకంగా జైలు నుంచే సహకరించారని, వీరికి పహల్గాం ఇతర ప్రాంతాల స్థానికులు సహకరించారని ప్రాధమికంగా తెలిసింది. దీనితో ఈ ఇద్దరిని క్షుణ్ణంగా ప్రశ్నించడం ద్వారా మరిన్ని నిజాలు రాబట్టుకోవాలని నియా నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News