Sunday, June 15, 2025

ఈ జాబ్ మీకు వస్తే రూ.90వేల జీతం..

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తోంది. ఈ ఏడాదికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I అధికారులుగా పనిచేసేందుకు 266 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య: 266
ఉద్యోగాలు – వెకెన్సీలు: జనరలిస్ట్: 170, డాక్టర్లు (ఎంబీబీఎస్‌): 14, లీగల్: 20, ఫైనాన్స్: 21, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 20, ఆటోమొబైల్ ఇంజినీర్లు: 21
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి అర్హత ఉంటుంది.(డిగ్రీ, బీకామ్‌, బీటెక్‌/బీఈ, ఎంబీబీఎస్‌, పీజీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంకామ్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్‌/ఎండీ)
వయస్సు: 21- 31 ఏళ్ల లోపు ఉండాలి
జీతం: నెలకు రూ.50,925 నుంచి రూ.90,000
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్
దరఖాస్తుకు ప్రారంభ తేది: 12 జూన్ 2025
దరఖాస్తుకు చివరి తేది: 3 జూలై 2025
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లై చేస్తే రూ.1000, ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లై చేస్తే రూ.250 ఫీజు
ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ
అఫీషియల్ వెబ్ సైట్: https://nationalinsurance.nic.co.in/

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News