Tuesday, July 29, 2025

జోరు మీదున్న అందాల తార

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం వెండితెర మీద సందడి చేస్తున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’తో నిధి అగర్వాల్ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ తన నెక్స్ మూవీ ప్రభాస్‌తో చేస్తున్న రాజా సాబ్ సినిమాతో మరో పెద్ద హిట్‌ను అందుకోవాలని తహతహలాడుతోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇద్దరు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నిధి అగర్వాల్… వీరమల్లు తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇక మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదలకానుంది. వీరమల్లు క్రేజ్ తోనే నిధికి ఒకటి రెండు ఆఫర్లు వచ్చే ఊపు కనబడుతోంది. ఇక రాజా సాబ్ హిట్ అయితే కచ్చితంగా టాలీవుడ్ లో నిధి హవా మొదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News