Sunday, August 24, 2025

ట్రంప్‌ను లైట్ తీసుకోవద్దు ..రష్యా చమురుపై తేల్చుకోండి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ అభ్యంతరాలు, హెచ్చరికలను భారతదేశం సీరియస్‌గా తీసుకోవల్సి ఉందని అధికార రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ సూచించారు. సజావుగా సాగుతున్న భారత్, అమెరికా సంబంధాలు బెడిసికొడుతున్న క్రమంలో ఆమె సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. నిక్కీకి భారత్ ఫ్రెండ్ అనే పేరుంది. రష్యా నుంచి భారత్ చమురు తీసుకోవడంపై ట్రంప్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తలెత్తిన పరిస్థితిని భారత ప్రభుత్వం వెంటనే చక్కదిద్దుకోవల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఎప్పుడో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ విషయంలో భారత్ స్పందించాల్సి ఉంది. వైట్‌హౌస్ వర్గాలతో సంప్రదింపులకు దిగితే మంచిదని అభిప్రాయపడ్డారు. చిరకాల మిత్రబంధంతో ఉన్న ఇరుదేశాలు రష్యా చమురు విషయంలో దూరం కావడం బాధాకరం అవుతుందని, ట్రంప్ చెపుతున్న అంశాలపై భారత్ సరైన రీతిలో వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని.. ఇంతకు ముందు సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న హేలీ తెలిపారు.

చిరకాల మిత్రబంధం ఉన్నందున ఇరుదేశాలు ఉన్నట్లుండి దూరం అయ్యే వీలులేదని, ఇంతకు ముందటి మిత్రత్వం ప్రాతిపదికన భారతదేశం ఇప్పుడు ఏర్పడుతున్న దూరాన్ని చెరిపేసుకోవల్సి ఉందని చెప్పారు. భారత్‌పై భారీ సుంకాలకు దిగే హక్కు తమ నేతకు ఉందని, ఇండియా నుంచి వచ్చే భారీ మొత్తాన్ని పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి వాడుతున్నారనే ట్రంప్ వాదన సబబే అని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో ఇండియా భారత్‌కు నిజమైన విలువైన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక మిత్రపక్ష దేశం, చైనా వంటిది కాదని ఆమె ట్రంప్ నిర్ణయాలపై కూడా విరుచుకుపడ్డారు. చైనాను ఎదుర్కోవడమే భారత్ అమెరికాల ఉమ్మడి అంశం కావల్సి ఉంటుంది. అంతేకానీ ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితి రాకూడదని ఆమె కోరారు. భారతీయ సంతతి, భారతీయ పూర్వపు మూలాలు ఉన్న నిక్కీహేలీ ఓసారి ఐరాసలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఇప్పుడు ట్రంప్ ఆమెను తమ అధికార యంత్రింగంలో కేబినెట్ హోదా స్థానంతో గౌరవించారు. రెండు అతి పెద్ద ప్రజాస్వామిక భావసారూప్య దేశాల సంబంధాలు బలీయంగా ఉండాలన్నారు. అత్యధిక యువశక్తితో భారత్ చైనాను దాటేసిన జనాభాతో ఉన్న సాగుతోన్న ఆర్థిక శక్తి అని ఆమె తేల్చివిశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News