యెమెన్: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో మరికొన్ని గంటల్లో మరణశిక్ష అమలు చేయనున్నారు. మరణ శిక్ష ఆపేందుకు ఒకే ఒక్క అవకాశం ఉంది. బ్లడ్‌మనీ (క్షమాధనం) ద్వారా మాత్రమే మరణ శిక్షణ ఆపవచ్చు. బ్లడ్‌మనీ అంటే బాధిత కుటుంబ సభ్యులు క్షమించామని చెబితే మరణశిక్షను అక్కడ చట్టాలు అపుతాయి. భారత్‌కు చెందిన మత గురువు కాంతాపురం ఎపి అబూబాకర్ ముస్లియార్ బాధిత కుటుంబ సభ్యులతో చర్యలు జరుపుతున్నారని నిమిష ప్రియ న్యాయవాది వెల్లడించారు. అబుబాకర్ బాధిత కుటుంబ సభ్యులతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, మత పెద్దలతో మాట్లాడుతున్నారు. చర్చలు జయప్రదంగా సాగితే మరణశిక్ష నుంచి ప్రియ బయటపడే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వం కూడా యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. భారత్, యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేకపోవడంతో చర్చలు సానుకూలంగా జరగడం లేదు. ప్రియ మరణ శిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం సాధ్యమైన ప్రయత్నాలు చేసిందని, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సోమవారం సుప్రీంకోర్టుకు వివరించారు. బ్లడ్‌మనీని దౌత్య పరంగా ఇప్పటివరకు గుర్తించలేదని భారత ప్రభుత్వం తెలియజేసింది. ఉరిశిక్షను ఆపేందుకు ఇండియా వద్ద ఎటువంటి మార్గాలు కనిపించడంలేదు. నిమిష ప్రియా బ్లడ్ మనీ కింద పది లక్షల డాలర్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్దపడింది. మధ్యవర్తిత్వం వహించిన లాయర్లు పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేయడంతో బ్లడ్ మనీ చర్చలు సజావుగా జరగలేదు.
కేరళలోని పాలక్కాడ్ చెందిన నిమిష ప్రియా ఉపాధి నిమిత్తం యెమెన్‌లో నర్సుగా సేవలందిస్తోంది. తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తి పరిచయడం కావడంతో అతడితో కలిసి వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను అమెను మహదీ వేధించాడు. వేధింపులు శృతి మించడంతో అతడిని ఆమె 2017లో మత్తు ఇంజక్షన్ తో చంపేసింది. అనంతరం అతడి శరీర భాగాను భూగర్భ ట్యాంక్ లో పడేసింది. యెమెన్ కోర్టు 2020లో ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేశాయి. ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె అప్పీల్‌ను 2023లో ఉన్నత న్యాయం స్థానం తిరస్కరించింది. దీంతో ఆమెకు జులై 16న ఆమెను ఉరి తీయనున్నారు. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.