- Advertisement -
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైసిపికి కాదు రాబందుల పార్టీకి అధ్యక్షుడని ఎపి జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ప్రమాదాన్నీ రాజకీయం చేస్తారా? అని నిమ్మల ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల పర్యటించారు. మన రైతు- మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులతో నాటి జగన్ పాలన సాగిందని మండిపడ్డారు. రాజధాని పునర్నిర్మాణం..రేపటి రోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతుల త్యాగంతో, ప్రతి పౌరుడు గర్వించేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -