- Advertisement -
అమరావతి: రాష్ట్రాలు, పార్టీలు వేరు కావచ్చు తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. పోలవరం నిధులను కూడా మళ్లించిన వ్యక్తి వైసిపి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నిమ్మల మీడియాతో మాట్లాడుతూ..పోలవరం డ్యాం 45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పులేదని, జగన్ రాక్షసత్వంతో అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టులో (Banakacharla project) కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులను భాగస్వామి చేస్తామని తెలియజేశారు. వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తి చేయడానికి కృషి చేస్తామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -