- Advertisement -
అమరావతి: ఎపిలో నాసిరకం మద్యంతో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ( nimmla Ramanaidu) తెలిపారు. వైసిపి జగన్ మోహన్ రెడ్డి పాలనలో మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని అన్నారు. నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. చట్ట ప్రకారమే మద్యం కుంభకోణంలో (liquor scandal) అరెస్టులు జరిగాయని, సిట్ దర్యాప్తులో ఆధారాన్నీ సేకరించాకే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని చెప్పారు. తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్షలు ఉంటాయని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -