Saturday, May 24, 2025

బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్

- Advertisement -
- Advertisement -

కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిదేళ్ల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ చిన్నారికి మే 22న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్(ఆర్‌ఎటి) చేయగా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి హర్ష్ గుప్తా వెల్లడించారు. ‘రోగిని బెంగళూరులోని కలాసిపాల్యలోని వాణి విలాస్ హాస్పిటల్‌లో చేర్చాం. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్‌కోటెకు చెందింది ఆ చిన్నారి అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కర్నాటకలో 16 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండు రావు మే 21న ధృవీకరించారు. కాగా ఇండియాలో మే 19 నాటికి మొత్తం 257 కోవిడ్19 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News