Wednesday, September 3, 2025

బిఆర్ఎస్ కు హరీష్ రావు గొప్ప సంపద: నిరంజన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎవరి ప్రయోజనం కోసం హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచం లాగా ఉండాల్సిన సమయంలో.. ప్రత్యర్ధి పార్టీలకు ఊతం ఇచ్చే విధంగా కవిత మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమ ఆలోచన నాటి నుంచి కెసిఆర్‌ వెంట హరీష్ ఉన్నారన్నారు. బ్రహ్మం గారికి సిద్దయ్య ఎలానో కెసిఆర్ కి హరీష్ రావు అలా.. ఏ పని చెప్పినా ఎదురు మాట్లాడకుండా పని చేశారని అన్నారు.

కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి హరీష్ రావు అని..  తెలంగాణ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వాళ్లమని నిరంజన్ రెడ్డి అన్నారు. నాడు హరీష్ రావు పని తీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారని.. వారికి ఎలా మనసు ఒప్పుతుందో తనకు అర్ధం కావడం లేదన్నారు. బిఆర్ఎస్ కు హరీష్ రావు గొప్ప సంపద అని అన్నారు. “హరీష్ రావుపై విమర్శలు చేస్తే లాభపడేది ఎవరూ?.. యూరియా దొరకక రైతులు, ప్రభుత్వ పథకాలు, హామీలు అమలు అవ్వక మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాటి మీద పోరాడకుండా ఈ పంచాయతీ ఏంటిది?. ఈ పంచాయతీతో ప్రజలకు, రైతులకు ఏమైనా లాభం జరుగుతుందా?” అని నిరంజన్ రెడ్డి కవితను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News