Sunday, September 7, 2025

ధరలకు బ్రేక్.. కొనుగోళ్ల జోరు

- Advertisement -
- Advertisement -
  •  గడపగడపకు జిఎస్‌టితో ముచ్చటయ్యే పండుగ
  •  ప్రత్యేక ఇంటర్వూలో ఆర్థిక మంత్రి సీతారామన్
  •  సామాన్యుడి బడ్జెట్‌కు మరింత ఊరట
  •  కొనుగోలు శక్తివంతంతో ఆర్థిక రంగ బలోపేతం

న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజనాల సంస్కరణలో జిఎస్‌టి ప్రక్షాళన మైలురాయి, అత్యంత కీలకం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పన్నుల వ్యవస్థలో చేపట్టిన మార్పులు చేర్పులు ప్రతి కుటుంబానికి చేరుతాయి. మంచి చేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో అత్యంత కీలక మార్పుల జిఎస్‌టి ప్రక్షాళన దశలో ప్రముఖ వార్తా సంస్థ పిటిఐకి ఆర్థిక మంత్రి శనివారం ఇంటర్వూ ఇచ్చారు. నిత్యావసర సరుకులు , విలాస సరుకులు, ఎలక్ట్రానిక్ సామాగ్రి ఈ విధంగా అనేక వినిమయ వస్తువు జిఎస్‌టి మార్పులను సంతరించుకుంటుంది. ఇంటింటికి గడపగడపకు దీని ప్రభావం కనబడుతుంది. పైగా తలసరి వినియోగం ఇనుమడిస్తుంది. దీనితో దేశ ఆర్థిక రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. సరుకుల కొనుగోళ్ల శక్తి పెరగడం అనేది భారతీయ విస్తృత మార్కెట్‌కు ఉపకరించే అంశం అవుతుందన్నారు.

త్వరలోనే ప్రజల నెలవారి బడ్జెట్ గతంతో పోల్చుకుంటే సవ్యమైన దిశలో ఉంటుందన్నారు. సరుకులు సేవల పన్ను (జిఎస్‌టి) రేట్ల తగ్గింపు ద్వారా ధరలు తగ్గేలా చూసేందుకు తాను వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తామన్నారు. ఇటువంటి తగ్గింపులకు పరిశ్రమలు కూడా ఆసక్తి చూపడం మరో మంచి పరిణామమని చెప్పక తప్పదని వెల్లడించారు. ఉత్పత్తిదార్ల తక్షణ స్పందనను ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుందన్నారు. జిఎస్‌టి మార్పుల నిర్ణయం కొద్ది రోజులకే కార్ల తయారీదార్లు మొదలుకుంటే ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు, పాదరక్షల , నగలు వజ్రాల బ్రాండ్ల వరకూ తమ ధరలలో గణనీయ తగ్గింపు ప్రకటించాయని, ఇది అనూహ్యమని వివరించారు. నూతన రేట్ల అమలు స్థాయిలో మరెన్నో సరుకుల ధరలు భారీ స్థాయిలోనే తగ్గుతాయని తెలిపారు. ఇది పండుగల సీజన్‌కు ముందస్తు పండుగ అవుతుందన్నారు.

పాలు, బ్రెడ్డు, పన్నీరుపై పన్ను ఉండదు
సంస్కరణల్లో భాగంగా ఇకపై పాలు బన్నులు, పన్నీరు వంటి వాటిపై ఎటువంటి జిఎస్‌టి భారం ఉండదు. అన్ని అంశాలను సరైన రీతిలో పరిశీలించుకుని, క్రమపద్ధతిలో ప్రజల అవసరాలను, మా ర్కెట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేసినట్లు సీతారామన్ చెప్పారు. సవ్యమైన సమీక్షల ఈ బృహత్తర కార్యక్రమంతో ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. త గ్గుదలతో శ్లాబ్‌ల శాస్త్రీయతతో ప్రజల వద్ద మరిం త డబ్బు ఆడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకు ముందు ఓ వందరూపాయలతో మార్కెట్‌కు వెళ్లి కొనుక్కున్న సరుకులను ఇప్పుడు అదే వందతో తెచ్చుకునే సరుకులను సరిపోల్చుకోవచ్చునని చెప్పారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఒక్కటిన్నర శాతం వరకూ ఎక్కువ మన బ్యాగుల్లోకి చేరుతాయన్నారు. ఇంతకు ముందు కొన్ని రకాల వస్తువులు , ప్రత్యేకించి ఆహార సరుకుల వర్గీకరణలో తలెత్తిన గందరగోళాన్ని ఇప్పుడు లేకుండా చేసినట్లు వివరించారు. ఇంతకు ముందు క్రీమ్‌బన్నులు 18 శాతం శ్లాబ్‌లో ఉండేవి. దీనిని ఇప్పుడు 5 శాతం పరిధిలోకి తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News