శ్రీహరికోట: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. నిసార్ ఉపగ్రహాన్ని (Nisar Satellite) మోసుకెళ్తున్న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్6 రాకెట్ విజయ వంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిసార్ ఉపగ్రహాన్ని అనుకున్న సమయంలో నిర్ణీత కక్ష్యలోకి జిఎస్ఎల్‌వి-ఎఫ్6 ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం కోసం 27 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్ జరిగింది.
‘నిసార్’ (Nisar Satellite) భూమిని అత్యంత ఖచ్చితత్వంతో స్కాన్ చేయగలగే శాటిలైట్. దీని బరువు 2,393 కిలోలు. ఇస్రో, నాసాలు సంయుక్తంగా ఈ శాటిలైట్‌ని రూపొందించాయి. 12 రోజుల్లో భూమిని నిసార్ మ్యాపింగ్ చేయగలదు. ఈ శాటిలైట్ డేటా కోసం 80 సంస్థలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ శాటిలైట్‌లో 12 మీటర్ల ప్రత్యేక రాడార్ యాంటినా ఉంది. నిసార్ హై రెజిల్యూషన్ ఫోటోలను అందిస్తుంది. ఈ ఏడాదిలో నిసార్ సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. భూమిని పరశీలించేందుకు నిసార్‌లో స్వీప్‌సార్ టెక్నాలజీని పొందుపరిచారు. అడవులు, పర్వతాలు. మంచు ప్రాంతాలపై ఇది రీసెర్చ్ చేయనుంది.