హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. అక్క, తమ్ముడి మధ్య ఉండే ఎమోషన్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో నటి లయ రీఎంట్రీ ఇస్తున్నారు. జూలై 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా నిర్మాత దిల్ రాజుతో (Dil Raju) హీరో నితిన్ ఓ ఇంటర్య్వూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను చర్చించారు.
అందులో భాగంగా నితిన్.. దిల్‌రాజుని (Dil Raju) భవిష్యత్తులో ఆయన బయోపిక్ తెరకెక్కనుందా..? ఒకవేళ బయోపిక్ తీస్తే. అందుకు తగిన కంటెంట్ ఉందా? అని ప్రశ్నించారు. దీనికి దిల్ రాజు కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉందని సమాధానం ఇచ్చారు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని గుర్తు చేశారు. ఒకవేళ బయోపిక్ తీస్తే.. హీరోగా ఎవరు సెట్ అవుతారని నితిన్ అడగగా.. చాలా మంది నితిన్ మీ తమ్ముడిలా ఉంటాడని అన్నారని.. కాబట్టి నితినే ఆ పాత్రకు సెట్ అవుతారని దిల్ రాజు తెలిపారు.
ఇక తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలై ఈ సినిమా ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాను పెంచేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాలి అంటే.. జూలై 4వ తేదీ వరకూ వేచి చూడాలి.