Saturday, August 2, 2025

ప్రధాని మోడీతో నితీశ్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఎలో చేరిన తర్వాత తొలి సమావేశం

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ కూటమిలో చేరి, బిజెపితో కలసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ బుధవారం నాడిక్క ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 12న అసెంబ్లీలో నితీవ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఐదు రోజులు ముందు ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జనవరి 28న బీహార్‌లో మహాగట్బంధన్ కూటమి నుంచి విడిపోయి ఎన్‌డిఎ కూటమితో చేతులు కలిపిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వచ్చిన నితీశ్ కుమార్ బిజెపికి చెందిన ఇతర సీనయిర్ నాయకులతో కూడా భేటీ కానున్నారు. బిజెపికి చెందిన బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, వినయ్ కుమార్ సిన్హా సోమవారం ప్రధాని మోడీని కలుసుకోవడం గమనార్హం. బిజెపి అగ్ర నేతలతో జరిగే సమావేశాలలో రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో ఆరు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడనున్నాయి. వీటికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News