ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు (Team India) నాలుగో టెస్ట్‌కి ముందు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 1-2 తేడాతో భారత్ వెనుకంజలో ఉంది. దీంతో నాలుగో టెస్ట్‌లో విజయం భారత్‌కు కీలకంగా మారింది. అయితే ఈ టెస్ట్‌కి ముందే జట్టును గాయాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే మూడో టెస్ట్‌లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయంతో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు నాలుగో టెస్ట్‌తో ఆరంగేట్రం చేస్తామని సిద్ధమైన అర్షదీప్ సింగ్ కూడా గాయపడ్డాడు.
బెకెన్‌హామ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని బౌలింగ్ హ్యాండ్‌కి గాయమైంది. దీంతో అతడు కూడా ఈ సిరీస్‌లో కొనసాగడం అనుమానమే. తాజాగా మరో ఆల్ రౌండర్ గాయపడ్డాడు. ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలికి గాయమైన కారణంగా అతడు ఇంగ్లండ్ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. అయితే అర్ష్‌దీప్ స్థానంలో యువ క్రికెటర్ అన్షుల్ కాంభోజ్‌ని జట్టులోకి తీసుకున్నారు.మరి నితీశ్ స్థానంలో ఎవరు తుది జట్టులో చోటు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.