ఢిల్లీ: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. నితీశ్ రానా- దిగ్వేష్ రాఠీ మధ్య వివాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌తో పాటు ఫైనల్‌లో నితీశ్ జట్టు వెస్ట్ ఢిల్లీ లయన్స్ విజయం సాధించింది. దిగ్వేశ్ వాగ్వాదంపై నితీశ్ వ్యవహరించిన తీరుపై భారత మాజీ క్రికెటర రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. డిపిఎల్‌లో నితీశ్-దిగ్వేశ్ మధ్య జరిగిన గొడవ స్పిన్నర్‌దే తప్పు జరిగి ఉండొచ్చని, కానీ నితీశ్ వ్యవహరించిన తీరు క్రీడాస్ఫూర్తికి మంచిదేనన్నాడు. ఈ మ్యాచ్‌లో నితీశ్ 15 సిక్స్‌లు కొట్టాడు, సెంచరీ బాది తన జట్టును గెలిపించాడని, ఇద్దరు జట్టు విజయం కోసం ఆడామని, పరిస్థితి హాట్‌గా ఉన్నప్పుడు మ్యాచ్‌కు మంచిదేనన్నాడు. దిగ్వేష్‌పై బురద చల్లకపోవడం క్రీడాస్ఫూర్తిని రగిలించిందని, సహచర ఆటగాల్ల క్యారెక్టర్‌ను తక్కువ చేయకూడదని అశ్విన్ తెలియజేశారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో దిగ్వేష్ రాఠీ బౌలింగ్ వేసేందుకు వచ్చి బంతిని విసరకుండా వెనక్కి వెళ్లిపోతాడు. నితీశ్ షాట్ ఆటడానికి కాచుకొని కూర్చొని ఉంటాడు. తరువాత దిగ్వేశ్ బంతిని విసిరేందుకు రగా నితీశ్ చివరి క్షణంలో పక్కకు జరుగుతాడు. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరును కవ్వించుకున్నారు. అతడి బౌలింగ్‌లో నితీశ్ సిక్స్ కొట్టి నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. అసలు దిగ్వేష్ వికెట్ తీసినప్పుడు ఆ విధంగానే సంబరాలు చేసుకుంటారు. తన సంబరాలను నితీశ్ కాపీ కొట్టాడనే ఆగ్రహం దిగ్వేశ్ నోటికి పని చెప్పాడు. నీతిశ్ వెనక్కి తగ్గకుండా దీటుగానే స్పందించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సహచర ఆటగాళ్లు ఇద్దరికి సర్ది చెప్పడంతో గొడవ ఆగిపోయింది.