Sunday, July 6, 2025

మమ్మీ గొంతు కోయకు డాడీ… బ్రతిమిలాడిన కూతుళ్లు.. హత్య

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్: విడాకుల కేసు కోర్టులో ఉండగా ఇద్దరు కూతుళ్ల ముందు భార్య గొంతు కోసి భర్త హత్య చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad Armoor) ఆర్మూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అంజలిని(35) , రెంజర్లకు చెందిన ముద్దంగుల గంగాధర్ 2007లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దుబాయ్‌లో ఉండి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇద్దరు మధ్య గొడవలు జరిగేవి. దీంతో ఇద్దరు బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దుబాయ్ నుంచి నెల రోజుల క్రితం తన సొంతూరుకు వచ్చాడు. బోధన్ కోర్టుకు రావాలని పిలిపించి నిజామాబాద్‌లో ఆమెను అతడు కలిశాడు. కోర్టుకు అవసరం లేదని చెప్పి ఆమె ఆర్మూర్‌కు వచ్చింది. దీంతో భర్త ఆమె ఇంటికి వెళ్లి కత్తి తీసుకొని భార్య దాడి చేశాడు. ఆమె కిందపడిపోవడంతో గొంతు కోశాడు. గొంతు కోస్తుండగా పిల్లలు ఇందు, స్పందన్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లను బెదిరించడంతో భార్యను హత్య చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News