Monday, August 18, 2025

నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: నిజాం సాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నిజాం సాగర్ ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆదివారం అర్ద రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జుక్కల్ ఎమ్మెల్యే కెప్టెన్ లక్ష్మి కాంత రావు చేతుల మీదుగా ఓకే గేట్ ఎత్తారు. అంతకు ముందు జోరువానలోనే ప్రాజెక్టు వద్ద గంగమ్మ పూజలు చేశారు. కానీ ఎగవ నుంచి వరద నీరి భారీగా వస్తుండడంతో సోమవారం ఉదయం మరో ఏడు గేట్ల ద్వారా మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తీ స్థాయి నీటిమట్టం కు చేరుకోవడంతో అప్రమత్తం అయినా అధికారులు దిగువన నది ప్రవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News