- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల కొరత ఎందుకు ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కనీసం ఎరువు బస్తా ఇవ్వలేని స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని చురకలంటించారు. తెలంగాణ వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకు ఉందని ప్రభుత్వాన్ని అడిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ మాత్రమే కాదు ఎరువు కూడా రైతులకు కరువు వచ్చిందని మండిపడ్డారు. 266 రూపాయల ఉండాల్సిన యూరియా బస్తా రేటు 325 రూపాయలకు చేరిందని దుయ్యబట్టారు. కృత్రిమ ఎరువుల కొరత ఎవరు సృష్టించారని కెటిఆర్ అడిగారు.
- Advertisement -