Monday, September 15, 2025

నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : స్థానిక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు తమదైన భారతీయతను చాటుకుంది. ఆదివారం రాత్రి భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పూర్తిగా భావోద్వేగాల నడుమ సాగింది. మ్యాచ్ ఆరంభంలో టాస్ తరువాతి క్రమంలో ఇరుదేశాల క్రికెట్ జట్ల క్యాప్టెన్ల పరస్పర కరచాలనం ఆనవాయితీ. అయితే భారత క్రికెట్ జట్టు క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ దశలో పాక్ క్రికెట్ జట్టు క్యాప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆయనను చూసీచూడనట్లుగా వ్యవహరించారు. వ్యాఖ్యాత రవిశాస్త్రి టాస్ ఇరువురికి చూపించిన తరువాత పద్ధతి ప్రకారం ఇచ్చే షేక్‌హాండ్‌కు సూర్యప్రకాశ్ ముందుకు రాలేదు. పాక్ క్యాప్టెన్‌కు తాను షేక్‌హాండ్ ఇచ్చేది లేదని టీం మేనేజ్‌మెంట్‌కు ముందుగానే సూర్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఇక టీం సభ్యులు ఇతరులకు కరచాలనం చేసేది లేనిది వారి ఇష్టం అని వివరించారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ విషయంలో తమ జట్టుకు కోటానుకోట్ల మంది భారతీయుల భావోద్వేగాల గురించి తెలుసునని జట్టు సభ్యులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి తరువాతి ఆపరేషన్ సిందూర్ క్రమంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారతీయులు సర్వత్రా స్పందిస్తున్న నేపథ్యంలోనే ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం కూడా టీమిండియా ఆటగాళ్లు.. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అంతకు ముందు గ్రౌండ్‌లోనే జరిగిన ఇరువురు క్యాప్టెన్ల భేటీ దశలో సూర్యకుమార్ యాదవ్ పాక్ జట్టు క్యాప్టెన్ ను మర్యాదపూర్వకంగా పలకరించారు. అక్కడే ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మెహిసన్ నక్వీతో ముచ్చటించారు.ఈ చర్యపై వెంటనే సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయి స్పందనలు వెలువడ్డాయి. దీనితోనే ఆ తరువాత సూర్యకుమార్ మ్యాచ్ ఆరంభ దశలో పాక్ జట్టుతో ముభావంగా ఉన్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News