Saturday, August 23, 2025

సస్పెన్స్‌ థ్రిలర్స్ చాలు.. ఇకపై అలాంటి సినిమాలు తీస్తా: దృశ్యం దర్శకుడు

- Advertisement -
- Advertisement -

జీతూ జోసెఫ్ (Jeethu Joseph) తెరకెక్కించిన ‘దృశ్యం’ సినిమా ఫ్రాంచైజీ మలయాళంలో ఎంత సక్సెస్ అయిందో ఇతర భాషల్లో కూడా అదే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇప్పుటికే ఈ ఫ్రాంచైజీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. త్వరలో మూడో సినిమా రానుంది. అయితే ఇక సస్పెన్స్ థ్రిలర్లు ఇక చాలని తనకు అనిపించిందని దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా వెల్లడించారు. తర్వాతి సినిమాలో కొత్తగా తీసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. దృశ్యం ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాల కంటే మూడో చిత్రం విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

‘‘నా కెరీర్ ఆరంభంలో ‘మై బాస్’, ‘మమ్మీ అండ్ మీ’ అనే వినోదాత్మక చిత్రాలు తీశాను. ఎప్పుడైతే ‘దృశ్యం’ వచ్చిందో.. అప్పటి నుంచి ఓ ఇమేజ్‌లో ఇరుక్కుపోయా. దృశ్యం సక్సెస్ అయిందనే ఉద్దేశ్యంతో రెండో భాగం రూపొందించలేదు. సీక్వెల్ చేస్తే బాగుంటుందని వచ్చిన సలహాల మేరకు చేశా. ఇతర చిత్రాలతో పోలిస్తే.. లాజిక్స్ ఎక్కువగా ఉండేందుకు ‘దృశ్యం 3’ స్క్రిప్టు 10 పేజీలు ఎక్కువగా రాయాల్సి వచ్చింది. ఇక ‘దృశ్యం 4’ ఉంటుందో లేదో చెప్పలేను’’ అని జోసెఫ్ (Jeethu Joseph) వెల్లడించారు.

Also Read : సస్పెన్స్ థ్రిల్లర్ ‘త్రిశెంకినీ’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News