చైనా సోషల్ మీడియా వేదిక టిక్‌టాక్‌పై ఉన్న నిషేధం ఎత్తివేతకు ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదు. టిక్‌టాక్, మరికొన్ని యాప్స్‌పై, సామాజిక మాధ్యమాలపై భారత్ ఆంక్షలు ఇప్పుడు లేవని, ఇప్పుడు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ఈ దశలో అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి. కొందరు నెటిజుజన్లు ఇటీవలి కాలంలో తాము డెస్క్‌టాప్ బ్రౌజరుతో టిక్‌టాక్ సేవలు అందుకుంటున్నామని చెపుతున్నారు. ఇందులో వాస్తవాలు తమకు తెలియదని, ఈ యాప్‌ను అన్‌బ్లాక్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. ఆంక్షల ఎత్తివేత వార్తలు దురుద్ధేశపూరితం. తప్పుడు ప్రచారంగా భావించాలని ప్రకటించారు. 2020లో మన సరిహద్దుల్లో చైనా సేనల దూకుడు, పరస్పర ఘర్షణల క్రమంలో నిషేధించిన పలు సోషల్ మీడియా వేదికలలో టిక్‌టాక్ కూడా ఉంది. భారత్ చైనా సయోధ్య సంకేతాల దశలో టిక్‌టాక్ తిరిగి వచ్చిందనే విషయం ప్రచారంలోకి వచ్చింది.
టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయలేదు: కేంద్రం
- Advertisement -
- Advertisement -
- Advertisement -