Friday, September 12, 2025

సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 10న జారీ చేసిన ఈ ప్రకటనలో మీడియా సిబ్బంది, ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగంణంలో అధికారిక వినియోగానికి మినహా.. వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, ఫోటోలు తీసేందుకు ఉపయోగించే ఫోన్స్, కెమెరా, ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ వంటి పరికరాలపై నిషేధం విధించింది.

ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై బార్ అసోసియేషన్ లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌లో (Supreme Court) ఆదేశించింది. నిబంధనలను అతిక్రమిస్తే.. ఆ మీడియాను నెల రోజుల పాటు ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. కోర్టు సిబ్భంది లేదా రిజిస్ట్రి, సంబంధిత ఉన్నతాధికారులు ఉల్లంఘటనలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తూ.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హై సెక్యూరిటీ జోన్‌లో సిబ్బంది, న్యాయవాదులు లేదా ఇతరులు ఫోటోలు లేదా వీడియోలు తీయకుండా నిరోధించే హక్కు భద్రతా సిబ్బందికి ఉంటుందని పేర్కొంది.

Also Read : కంగనా రనౌత్‌కు షాక్.. చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News