- Advertisement -
జగదేవ్పూర్: వైరల్ జ్వరాలు రాష్ట్రంలో వ్యాపిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. సిద్ధపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో ఆయన పర్యటించారు. వైరల్ జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకున్నారు. వైరల్ ఫీవర్తో మృతి చెందిన మహేశ్ (35), శ్రవణ్ (15) కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించింది. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది’’ అని అన్నారు. తిమ్మాపూర్లో డెంగీ జ్వరంతో ఇద్దరు చనిపోయారని మండిపడ్డారు. మరో 40 నుంచి 50 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. గ్రామాలకు నిధులు లేక పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
- Advertisement -