కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి నమోదైన కేసులో కోర్టు ఎదుట హాజరు కావాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా బండి సంజయ్ హాజరు కాకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున వ్యక్తిగత హాజరుకు మరికొంత సమయం కావాలని కొరుతూ బండి సంజయ్
న్యాయవాది రీకాల్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ నెల 30వ తేదీన హాజరైయ్యేందుకు అనుమతి కోరనున్నారు. మరోక కేసులో రాష్ట్ర మంత్రికి సైతం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారి అయింది. రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎన్నికల సందర్భంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు మంత్రి ఉత్తమ్ గైర్హాజరు కావడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.