Thursday, July 31, 2025

రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు సైనిక సహాయం అందిస్తున్న ఉత్తర కొరియా ఆ దేశానికి మరిన్ని ఆయుధాలను పంపించింది. ఇటీవల అమెరికా తయారీ క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.ఇప్పటివరకు 13 వేలకు పైగా ఆయుధ కంటైనర్లను పంపినట్టు గత నెలలో నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించింది. ఇప్పటికే 10 వేల మందికి పైగా సైనికులను రష్యాకు పంపించింది. ఇటీవల అదనపు ఫిరంగి వ్యవస్థను కిమ్ ప్రభుత్వం అందజేసిందని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ వెల్లడించింది. తాజాగా 170 గన్‌లు, 240 రాకెట్లను తరలించినట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News