Monday, May 5, 2025

3 ఇయర్‌బడ్స్ ను విడుదల చేసిన నథింగ్ సిఎంఎఫ్

- Advertisement -
- Advertisement -

లండన్‌-ఆధారితమైన టెక్నాలజీ కంపెనీ నథింగ్ ఉప-బ్రాండ్ అయిన CMF నాలుగు కొత్త ఉత్పత్తులు.. CMF ఫోన్ 2 ప్రో, బడ్స్ 2, బడ్స్ 2 ప్లస్, బడ్స్ 2aలను ప్రకటించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ Q1 2025 ఇండియా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ నివేదిక ఈ త్రైమాసికంలో ఇండియాలో అత్యంత వేగంగా- ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నథింగ్ ను పేర్కొనడంతో, ఏటేటా 156% ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేస్తూ అది ఈ సంవత్సరం తన బలమైన ప్రారంభాన్ని కొనసాగించింది. వరుసగా ఐదవ త్రైమాసికంలో అత్యంత వేగంగా – ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నథింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకొని పదిలం చేసుకుంది. ఈ సాధనతో నథింగ్, గడచిన దశాబ్దంలో భారతీయ మార్కెట్లో ఈ గణనీయమైన మైలురాయిని చేరుకున్న ఏకైక బ్రాండ్ అయింది.

CMF ఫోన్ 2 ప్రో

ఈ విభాగంలోనే అత్యుత్తమమైన మూడు-కెమెరాల సిస్టమ్, అద్భుతమైన ప్రకాశవంతమైన డిస్‌ప్లే మరియు ప్రీమియం డిజైన్‌తో, CMF ఫోన్ 2 ప్రో అనేది అల్టిమేట్ డైలీ స్మార్ట్‌ఫోన్ అయింది. కేవలం 7.8 ఎంఎం పలచని మరియు కేవలం 185 గ్రాముల బరువుతో, ఇది నథింగ్ ఇప్పటివరకు రూపొందించని అత్యంత పలచని మరియు తేలికైన స్మార్ట్‌ఫోన్ – CMF ఫోన్ 1 కంటే 5% పలచనగా ఉంటుంది. ఇది నాలుగు రంగులలో లభిస్తోంది: తెలుపు, నలుపు, ఆరంజ్ మరియు లేత ఆకుపచ్చ, ప్రతీదీ విశిష్టమైన ఫినిష్‌లు మరియు టెక్స్‌చర్లను కలిగి ఉంటుంది.

CMF ఫోన్ 2 ప్రో అనేది అధునాతన మూడు-కెమెరాల వ్యవస్థను కలిగి ఉంది, 50 MP ప్రధాన కెమెరా CMF ఫోన్ 1 కంటే 64% ఎక్కువ వెలుగును గ్రహిస్తుంది. చాలా దూరంలో ఉండే దృశ్యాల కోసం, విభాగంలోని మొదటి 50MP టెలిఫోటో లెన్స్, 2x ఆప్టికల్ జూమ్ మరియు 20x వరకు అల్ట్రా జూమ్‌ను అందిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా విస్తృతమైన వీక్షణ పరిధిని అందిస్తుంది, ప్రకృతి దృశ్యాల నుండి ఆకాశపు అంచుల వరకు ప్రతిదానికీ ఇది కచ్చితమైనది, కాగా 16 MP ఫ్రంట్ కెమెరా మీ అత్యంత పదునైన సెల్ఫీలను తీయడానికి సిద్ధంగా ఉంది.

కొత్తగా ఉన్నతీకరించబడిన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో 5G ప్రాసెసర్ CMF ఫోన్ 1 తో పోలిస్తే 10% త్వరితమైన ప్రాసెసింగ్ మరియు గ్రాఫిక్స్‌లో 5% మెరుగుదలను అందజేస్తుంది. ఫోన్ 1 కంటే దాదాపు ఒక గంట ఎక్కువసేపు నిలిచి ఉండే 5000 mAh బ్యాటరీతో, CMF ఫోన్ 2 ప్రో ఒకే ఛార్జ్‌పై రెండు రోజుల పాటు శ్రమ లేకుండా పవర్ ని అందిస్తుంది. ఈ ఉపకరణం 1.07 బిలియన్ రంగులతో అద్భుతమైన 6.77″ FHD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో, అల్ట్రా HDR సామర్థ్యం మరియు 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశవంతాన్ని కలిగి ఉంది.

CMF ఆడియో

CMF బడ్స్ 2025 లైనప్ అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తూ బహుళ ధర పాయింట్ల వ్యాప్తంగా ఉంటుంది. రోజువారీ ఆడియో అవసరాల నుండి సంలీనమయ్యే సెషన్లు మరియు వ్యక్తిగతీకృతమైన ధ్వని వరకు, ప్రతి అవసరానికీ మరియు మ్యూజిక్ ప్రొఫైల్‌కు ఒక జత CMF బడ్స్ ఉన్నాయి.

ధర మరియు లభ్యత

● CMF ఫోన్ 2 ప్రో తెలుపు, నలుపు, ఆరంజ్ మరియు లేత ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది

● 8+128 జిబి – రు. 17,999 (బ్యాంక్ లేదా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో సహా)

● 8+256 జిబి – రు. 19,999 (బ్యాంక్ లేదా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో సహా)

● మే 5 వ తేదీన ప్రత్యేక పరిచయ ఆఫరుగా, CMF ఫోన్ 2 ప్రో 8+128 జిబి వేరియంట్ రు. 16,999 మరియు 8+256 జిబి వేరియంట్ రు. 18,999 (అన్ని ఆఫర్లతో సహా) ధరకు అందుబాటులో ఉంటుంది.

● 1 వ రోజు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్: CMF ఫోన్ 2 ప్రో పైన రు.1,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రు. 1,000 బ్యాంక్ ఆఫర్ (అన్ని ప్రముఖ బ్యాంకులకు వర్తిస్తుంది) కలిసి లభిస్తాయి.

● CMF బడ్స్ 2a ధర రు. 2,199, CMF బడ్స్ 2 ధర రు. 2,699, మరియు CMF బడ్స్ 2 ప్లస్ ధర రు. 3,299 గా ఉంటుంది.

● లభ్యత:

● మే 5, 2025 నుండి CMF ఫోన్ 2 ప్రో, ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, విజయ్ సేల్స్, క్రోమా మరియు ప్రముఖ రిటైల్ స్టోరులు అన్నింటి ద్వారా అమ్మకం మొదలవుతుంది.

● CMF బడ్స్ 2, బడ్స్ 2 ప్లస్, మరియు బడ్స్ 2a అనేవి 2025 రెండవ త్రైమాసికం చివరి నాటికి ఇండియాలో అందుబాటులో ఉంటాయి.

● CMF ఫోన్ 2 ప్రో అనుబంధ పరికరాలు త్వరలో ఇండియాలో లాంచ్ చేయబడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News