మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసిలో 1,743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈడబ్లుస్ కేటగిరి వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని బోర్డు తెలిపింది. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టులకు ఎస్‌ఎస్‌సి లేదా సమాన వైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, శ్రామిక్ పోస్టులకు ఐటిఐ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ సైట్ tgprb.in ని సంప్రదించవచ్చని పోలీసు నియామక మండలి పేర్కొంది.
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్‌టిసిలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -