Friday, June 27, 2025

ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm)

అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. గత 18 నెలల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్, స్టాఫ్ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్‌నర్స్) 2322 పోస్టులు ఉన్నాయి. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News