Thursday, May 1, 2025

రంగంలోకి బడా బ్యానర్?

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్,- నీల్ మూవీపై అభిమానులతో పాటు సినీ సర్కిల్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మంగళవారం నుంచి షూటింగ్‌లో చేరారు. కాగా ఇప్పుడు ఈ చిత్రంలోకి ప్రముఖ నిర్మాణ సంస్థ టి -సిరీస్ కూడా వచ్చి సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించనుంది. ప్రతిఫలంగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్ -థియేట్రికల్ రైట్స్‌తో పాటు ఈ సినిమాలో షేర్ కూడా టి-సిరీస్ తీసుకోనుందట. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించాడు. ఇక ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News