స్టార్ హీరో ఎన్టీఆర్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ – కలయికలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్‌లు ఉంటాయని.. అందుకు తగ్గట్టు సెకండ్ హాఫ్‌లో ఎన్టీఆర్ పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్‌ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ఎన్టీఆర్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకున్నాడు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. కాబట్టి ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ