ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాపైనే ఫ్యాన్స్ దృష్టి పెట్టారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్2 తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కూడా ఇదే. అందుకే, ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే పడింది. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్‌లో విభిన్న శైలితో ఎన్టీఆర్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌గా నిలుస్తాడట. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకెల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -