Friday, May 16, 2025

‘వార్-2’.. అందుకోసం ఎదురుచూస్తున్నా: ఎన్టిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘వార్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్‌-2’ త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టిఆర్ (NTR) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా కియారా అడ్వాణీ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ని హీరో హృతిక్ అందించారు.

మే 20న ఎన్‌టిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ రానున్నట్లు హృతిక్ (Hrithik Roshan) సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎన్టిఆర్ మే 20వ తేదీన ఏం జరుగుతుందో నీకు అంచనా ఉంది. కానీ అంతకు మించింది ఒకటి సిద్ధంగా ఉంది’ అంటూ హృతిక్ పోస్ట్ చేశారు. దీనిపై ఎన్టిఆర్ కూడా స్పందించారు. దీనిపై ఎన్టిఆర్ (NTR).. ‘‘థ్యాంకు హృతిక్ సర్.. కబీర్ నిన్ను వేటాడి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నా’’ అని రాసుకొచ్చారు. అయితే మే 20న వచ్చే సర్‌ప్రైజ్.. సినిమా ట్రైలరే అని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. అందుకోసం ప్రతీ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News