Sunday, August 10, 2025

జింబాబ్వేపై కివీస్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

20తో సిరీస్ క్లీన్ స్వీప్
బులవాయో: జింబాబ్వేతో జరిగిన రెండో, చివరి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 359 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది మూడో అతి పెద్ద వి జయం కావడం విశేషం. ఈ గెలుపుతో కివీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చే సింది. న్యూజిలాండ్ జట్టు 601/3 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ డెవన్ కాన్వే (153), హెన్రీ నికోలస్ (150) నా టౌ ట్, రచిన్ రవీంద్ర (165) నాటౌట్ సెంచరీల తో కదం తొక్కారు. విల్ యంగ్ (74) కూడా తనవంతు పాత్ర పోషించాడు. దీంతో కివీస్‌కు 476 పరగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే కుప్పకూలింది.

కాగా, భారీ లోటుతో శనివారం మూడో రోజు రెండో ఇ న్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. జకారి ఫౌల్స్ అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. 37 పరుగులు మా త్ర మే ఇచ్చిన జకారి ఐదు వికెట్లను తన ఖాతా లో వేసుకున్నాడు. మాట్ హెన్రీ, జాకబ్ డఫీ రెం డేసి వికెట్లు పడగొట్టి తమవంతు పాత్ర పో షించారు. జింబాబ్వే టీమ్‌లో నిక్ వెల్చ్ 47 (నాటౌ ట్), క్రెగ్ ఇర్విన్ (17) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. మిగతావారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో జిం బా బ్వే ఇన్నింగ్స్ 28.1 ఓవర్లలో 117 పరుగులకే పరిమితమైంది. డెవొన్ కాన్వేకు మ్యాచ్ ఆ ఫ్‌ది మ్యాచ్, మాట్ హెన్రీ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News