Sunday, August 3, 2025

గ్రానైట్ క్వారీ కూలి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీ అంచు విరిగి బండరాళ్ళు పడడంతో ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీలను పని చేస్తుండగా ప్రమాదవశాత్తు క్వారీ కూలినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News