Thursday, May 8, 2025

ఓటిటిలోకి తమన్నా ‘ఓదెల 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

- Advertisement -
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల 2’. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత తమన్నా నటించిన మూవీ ఇదే. ఇందులో పవర్ ఫుల్ సాధువుగా ఆమె నటించారు. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సంపత్‌ నంది కథ అందిచగా.. అశోక్‌ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

రిలీజ్ కు ముందు ఈ మూవీపై మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే, గత నెలలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వెండితెరపై అలరించని ఈ మూవీ.. ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ను వెల్లడించారు. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో గురువారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News