భువనేశ్వర్: మంగళవారం భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికలో ఎన్‌డిఎ అభ్యర్థిగా సిపి రామచంద్రన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిలు పోటీపడనునున్నారు. అయితే ఎన్నికల ముందే పలు పార్టీలు తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. తెలంగాణ నుంచి బిఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు మంగళవారం ప్రకటించింది. తాజాగా మరో పార్టీ కూడా బిఆర్‌ఎస్ బాటలోనే తమ నిర్ణయాన్ని తెలిపింది. ఒడిశాలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజూ జనతాదళ్(బిజెడి) (BJD Party) ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో తమ పార్టీ ఎంపిలు దూరంగా ఉంటారని తెలిపింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ ఎంపి సస్మిత్ పాత్రా వెల్లడించారు.
పార్టీ ఎంపిలు, రాజకీయ వ్యవహారాల కమిటీలతో సంప్రదింపుల అనంతరం మాజీ సిఎం, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. ఎన్డిఎ, ఇండియా కూటములకు తమ పార్టీ సమాన దూరం కొనసాగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ దృష్టి అంతా రాష్ట్రాభివృద్ధి, 4.5 కోట్ల ప్రజల అభ్యున్నతి పైనే అని పాత్ర తెలిపారు. బిజెడికి (BJD Party) రాజ్యసభలో ఏడుగురు ఎంపిలు ఉన్నారు.
Also Read : ఎర్రబారిన నెలరాజు.. ఆకాశంలో భలే బ్లడ్‌మూన్