Monday, July 21, 2025

మత్తు మందు ఇచ్చి.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై కాంగ్రెస్ స్టూడెంట్ లీడర్ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

కోల్ కతాలో ఇటీవల మెడికల్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రా.. జూన్ 25న లా కాలేజీలోని గార్డు గదిలో మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులతో కలిసి విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లు పట్టుకున్న వినకుండా తనపై దాడి చేశారని బాధితురాలి వాపోయింది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. తాజాగా ఒడిశాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మార్చిలో ఒక హోటల్ గదిలో ప్రధాన్ తనపై మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, మార్చి 18న భువనేశ్వర్‌లోని మాస్టర్ క్యాంటీన్ చౌక్‌లో తాను ఇద్దరు స్నేహితులను కలిశానని.. ఇంతలో NSUI ఒడిశా అధ్యక్షుడిగా ఉదిత్ ప్రధాన్ పరిచయం చేసుకుని మాతో కలిశాడని… తర్వాత కారులో ప్రధాన్ తన పక్కన కూర్చుని తనను అనుచితంగా తాకడం ప్రారంభించాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత అందరూ ఒక హోటల్‌కు వెళ్లి, గది బుక్ చేసుకుని, మద్యం సేవించడం ప్రారంభించారు. మద్యం తాగనని చెప్పడంతో, ప్రధాన్ తనకు ఒక గ్లాసు జ్యూస్ ఇచ్చాడని బాధితురాలు చెప్పింది. “నేను దానిని తాగిన వెంటనే, నాకు తల తిరుగుతున్నట్లు అనిపించింది. దీంతో నన్ను ఇంటి వద్ద దింపమని అడిగాను. ఆ తర్వాత, నాకు ఏమీ గుర్తులేదు. తాను స్పృహలోకి వచ్చినప్పుడు, హోటల్ గదిలో ప్రధాన్ తన పక్కనే పడుకున్నాడు” అని వివరించింది. శరీర నొప్పి అనిపించడంతో తనపై లైంగిక దాడి జరిగిందని గ్రహించి.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు BNS సెక్షన్లు 64(1), 123, 296, 74, 351(2) కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన్‌ను అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ అరెస్టు ఒడిశా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులు ప్రస్తుతం ప్రధాన్‌ను విచారిస్తున్నారు. హోటల్ రికార్డులు, వైద్య నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News