ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు పలు మార్లు అత్యాచారానికి పాల్పడిన.. తీరా ఆమె గర్భవతి అని తెలియడంతో సజీవంగానే పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. ఒడిశాలోని జగత్‌పూర్ (Odisha Jagatpur) జిల్లాలో ఈ ఘటన జరిగింది. జగత్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక ఐదు నెలల గర్భం దాల్చింది. ఈ విషయం తెలియగానే ఆమెను బెదిరించి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చారు.
ఆ ప్రాంతంలో బాలికను సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారు. బాలిక ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకొని స్థానికులకు విషయం చెప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి (Odisha Jagatpur) చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితులను ఇద్దరు సోదరులు భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్ వారి స్నేహితుడు తుళు బాబుగా గుర్తించారు. ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తుళు బాబు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలియజేశారు.