- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బిసి బాలుర హాస్టల్ ను సోమవారం రాత్రి మండల ప్రత్యేక అధికారి, బిసి సంక్షేమశాఖ జిల్లా అధికారి యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి హాస్టల్ లో నిద్రించారు. మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ ఆయన వెంట ఉన్నారు. ఎస్సి బాలిక ల హాస్టల్ ను మండల వైద్యాధికారి తీపిరెడ్డి గోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. హాస్టల్స్ లోని సరుకులు, బియ్యం, రిజిస్టర్ లను అధికారులు పరిశీలించారు.
- Advertisement -