ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సెలవుల్లో ఉన్న జవాన్లను ఆర్మీ ఉన్నతాధికారులు బార్దర్ కు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో పెళ్లైన మూడు రోజులకే ఓ జవాన్ కు బార్డర్‌కు తిరిగిరావాలని పిలుపు రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది.
అయితే, వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్‌కు.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బార్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. మనోజ్ భార్య యామిని ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి మనోజ్ ను రైలు ఎక్కించి బార్డర్ కు పంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, పాక్ కాల్పుల్లో మరో జవాన్ మృతి చెందారు. నిన్న ఎపిలోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందారు.