Monday, August 25, 2025

వినాయక చవితి కానుకగా ‘ఓజీ’ రెండో పాట..

- Advertisement -
- Advertisement -

పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా రూపొందుతున్న చిత్రం ఓజీ. ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ బ్లాక్‌బ్లస్టర్ చిత్రం తర్వాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా పాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా నుంచి ఓ ప్రత్యేక అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఇప్పటి విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేయడంతో ఇప్పుడు ఈ అప్డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ నుంచి సువ్వీ సువ్వీ అంటూ సాగే పాటను వినాయక చవితి పర్వదిన్నాన్ని పురస్కరించుకుని ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ సైతం విడుదల చేయగా ఇప్పుడది నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పవన్ మాస్‌లుక్స్ రిలీజ్ చేసి యూత్‌లో అదిరిపోయే క్రేజ్ తీసుకు వచ్చిన మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో అందరినీ అలరించారు. హీరో పవన్ కళ్యాణ్ సాత్వికంగా ఉండి కథానాయికతో కలిసి కోలనులో దీపాలు వదులుతున్న లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ చూసిన పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News