కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. (Oh, Bhama Ayyo Rama) మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఈ చిత్రం థియేటర్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రం నుంచి ‘రామచంద్రుడే’ అంటూ కొనసాగే ఓ బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరో, హీరోయిన్‌పై అందమైన విజువల్స్‌తో మోస్ట్ బ్యూటిఫుల్‌గా చిత్రీకరించిన ఈ పెళ్లి సాంగ్‌కు శ్రీ హర్ష ఈమని, పార్థు సన్నిధిరాజు సాహిత్యం అందించగా, టిప్పు అండ్ హరిణి టిప్పు ఈ సాంగ్‌ను పాడారు. రథన్ ఈ పాటకు మధురమైన సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ పెళ్లి పాట తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుందని అన్నారు.
మైమరపించే పెళ్లి పాట
- Advertisement -
- Advertisement -
- Advertisement -