కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అన్ని వర్గాలకు కావాలసిన అంశాలు ఇందులో ఉంటాయి.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అందర్ని అలరిస్తుంది. ఇదొక క్యూట్ అండ్ ఎంటర్టైనింగ్ లవ్‌స్టోరీలా సినిమాలోని ప్రతి ఫేమ్ కలర్ఫుల్గా ఉంటుంది. సుహాస్ ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రామ్‌గా సుహాస్, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు”అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ “సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది”అని తెలిపారు.